Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 January 2025, 5:30 pm Posted by : ramakrishna

ప్రజావాణికి దుమ్మ కొట్టిన అధికారులపై చర్యలు లేవా! 

  •  తూ తూ మంత్రంగా నిర్వహిస్తున్న ప్రజావాణి
  •  ఫిర్యాదుదారులు లేకపోవడంతోనే బోసిపోతున్న ప్రజావాణి

నిజాంసాగర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో తప్పకుండా ప్రతి ఒక్క అధికారి పాల్గొనాలని ఆదేశాలు ఉన్నప్పటికీ. తమకేమీ పట్టనట్లు కొందరు అధికారులు డుమ్మ కొట్టడంపై మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజావాణిలో పాల్గొన్న తాసిల్దార్, ఎంపీడీవో, ఏపీవో, ఎంపీఓ, ఐకెపి ఎపిఎం, అంగన్వాడి, అధికారులే తప్ప మిగతా ఈ శాఖ అధికారులు కూడా ప్రజావాణిలో పాల్గొనకపోవడంతో పలు విమర్శలు వినిపిస్తున్నాయి. వీరిపై చర్యలు లేవా! అని ప్రశ్నిస్తున్నారు.  ప్రజావాణిలో ఫిర్యాదులు రాకపోవడంతోనే పలు శాఖ అధికారులు దుమ్మా కొడుతున్నట్లు సమాచారం. ఇకనైనా జిల్లా అధికారులు చర్యలు తీసుకొని ప్రజావాణిలో పాల్గొనేలా చూడాలని మండలవాసులు తెలిపారు.