బీఆర్ఎస్ రజతోత్సవ వేళ 40 నిమిషాల పాటు ప్రసంగం
వెబ్ న్యూస్, బతుకమ్మ : వరంగల్ లోని ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ పై ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. ఈమేరకు కేసీఆర్ షెడ్యూల్ విడుదలైంది. సాయంత్రం 5.30 గంటలకు ఫాంహౌస్ నుంచి హెలికాప్టర్ లో కేసీఆర్ బయలుదేరి, 6 గంటలకు ఎల్కతుర్తికి చేరుకోకున్నారు. సభా వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీటింగ్ హాల్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఏడు గంటలకు బహిరంగ సభ వేదికపైకి కేసీఆర్ రానున్నారు. 7.40 వరకు దాదాపు 40 నిమిషాలు ప్రసంగించనున్నారు.