. . . పిసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్, బతుకమ్మ:
సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వాఖ్యాలపై పై పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ..కాంగ్రెస్ లో పార్టీలో ప్రజా స్వామ్యం ఎక్కువైందన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మీడియాతో పీసీసీ చీఫ్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టిలో అంతర్గతంగా రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి లు చేసిన వ్యాఖ్యలను ఏ.ఐ.సీసీ పరిశీలన చేస్తుంది అన్నారు. దానిపై పార్టి క్రమ శిక్షణ సంఘం చర్యల అంశం పై ఏ.ఐ. సి.సి స్పందిస్తుంది అని తెలిపారు. సరైన సమయంలో నిర్ణయం ఉంటుంది అన్నారు. మాజీ మంత్రి కొండా సురేఖ విషయంలో మొదటి సారి చర్యలు తీసుకోలేదు. రెండు మూడు సార్లు పరిశీలించి ఏ. ఐ.సీసీ చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. ఏపీ జల దోపిడి ఆరోపణల పై టిపీసీసీ చీఫ్ మాట్లాడుతూ నీటి వాటా విషయంలో ఒక్క బొట్టు ను వదులుకోము, నీటి జలాల పై రాజీ పడే ప్రసక్తే లేదు, తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేసే అవసరం లేదు అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రేసిడేంట్ కేటీఆర్ చేసిన ఆరోపణల పై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు.ఫార్ములా ఈ కారు రేసు, కాళేశ్వరం దోపిడి, భూ కుంభ కోణాల కు పాల్పడి అడ్డంగా దొరికిన అవినీతి పరుల మాట్లాడేది అన్నారు. ఢిల్లీకి మూటలు పంపాల్సిన అవసరం లేదు, రాహుల్ గాంధీ సంపన్నుల కుటుంబం లో పుట్టారు అని గుర్తు చేశారు.రాహుల్ గాంధీ పై విమర్శణలు చేసే ముందు ఒక సారి ఆయన త్యాగం తెలుసుకో అని కేటిఆర్ కు హితువు పలికారు. అతిత్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షులుయ నగేష్ రెడ్డి, బోబ్బిలి రామక్రిష్ణ, శేఖర్ గౌడ్, పంచరెడ్డి చరణ్ తధితరులు పా రాబోయే రోజుల్లో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుంది