Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 November 2025, 5:17 pm Posted by : ramakrishna

మా గురువు ధర్మపురి శ్రీనివాస్ ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది

. . . పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : 

 

రాజకీయ ఓనమాలు నేర్పిన వ్యక్తి, ఎలక్షన్‌లో ఓడినప్పుడూ నాకు బాసటగా నిలిచిన మా గురువు దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.  ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు, నిజామాబాద్ తొలి మేయర్ ధర్మపురి సంజయ్ పదవి స్వీకార ప్రమాణస్వీకార కార్యక్రమానికి మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం  ప్రకటించిన డీసీసీ కమిటీల్లో 16 మంది బీసీ నేతలకు చోటు కల్పించడం మా ప్రభుత్వ బీసీ సంకల్పానికి నిదర్శనమన్నారు. డి.శ్రీనివాస్ ని గుర్తుకు తెచ్చారనీ ఖమ్మం నుండి ఒక నాయకుడు ఫోన్ చేసి అభినందించినట్లు తెలిపారు. కులభిమానం తప్పు కాదు, కానీ కులపిచ్చి ఉండకూడదని, బీసీలు 56 శాతం ఉన్నారనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దన్నారు. బీసీల అభ్యున్నతికి సీఎం రేవంత్ రెడ్డి  కట్టుబడి పనిచేస్తున్నామని, బీసీలు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా అభివృద్ధిని ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపు బిడ్డలను పిసిసి స్థాయికి చేర్చిందని, మున్నూరు కాపులపై కాంగ్రెస్‌కు అనుబంధం ఎనలేనిదన్నారు. నేను పిసిసి అధ్యక్షుడిని అవుతానని నా గురువు స్వర్గీయ శ్రీనివాస్ ఓ జర్నలిస్టుతో మాట్లాడుతూ నమ్మకం వ్యక్తం చేసిన మాటలు నన్ను మరింత బాధ్యతతో నడిపిస్తున్నాయని గుర్తు చేశారు. డీ శ్రీనివాస్ నాకు రాజకీయ గురువు ఆయన మరణం ఆశ్చర్యకరమని, ఆయన ఆశయాలకు అనుగుణంగా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామననారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని, రాష్ట్రంలో 17 డీసీసీ పదవులను బీసీలకు ఇచ్చాము,75 శాతం బీసీ ఎస్టీ ఎస్టీలకు ఇచ్చామమని తెలిపారు. కాంగ్రెస్ చేపట్టిన బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ దేశ చరిత్రలో నిలిచిపోతుందని, బీసీలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని, బీసీ కులాలన్నీ ఏకతాటిపైకి రావాలి తీసుకురావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపు సామాజికవర్గ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.

There is a need to remember our Guru Srinivas

. . . అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కి నిధులు తెస్తాం :  ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కి నిధులు తెస్తామని, ఇందు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తామని ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ ప్రజల మనిషి అని, పిల్లల భవిష్యత్ కోసం సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారన్నారు. త్వరలోనే ఫీజు రీ యంబర్స్ మెంట్ నిధులు విడుదల చేస్తామని,కాంగ్రెస్ తోనే అబివృద్ది సాధ్యమన్నారు. కొత్త కాలేజీలు ఏర్పాటు మాతోనే సాధ్యమన్నారు.

There is a need to remember our Guru Srinivas

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఈరావత్రి అనిల్,అన్వేష్ రెడ్డి,  తాహెర్ బిన్, వ్యవసాయ రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, మాజీ  ఎమ్మెల్సీ ఆకుల లలితతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.