వానొస్తది..

హైదరాబాద్, బతుకమ్మ: ఓ వైపు ఎండ తీవ్రత పెరుగుతుండడంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా భారత వాతావరణం విభాగం చల్లని కబురు అందించింది. ఏప్రిల్ 1 నుంచి 4వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత పది రోజుల వ్యవధిలో వాతావరణంలో అనూహ్యంగా మార్పులు చోటు చేసుకుని ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే రాష్ర్టంలోని నిజామాబాద్ తోపాటు కామారెడ్డి, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, వికారాబాద్, మహబూబ్ నగర్, మెదక్...