. . . ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్
హైదరాబాద్, బతుకమ్మ :
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరగకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక అప్రమత్తతతో పనిచేస్తోందని ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. శనివారం ఇందిరా భవన్‌లో మీనాక్షి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బీఎల్ఎలు, ఎస్ఎస్ఎలతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెక్యులర్ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఓట్ల తొలగింపు కుట్రలు జరుగుతున్నాయన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ప్రతి ఓటును కాపాడటం ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకమని పేర్కొన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ, ఓటర్ల జాబితాలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా పనిచేస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.
