Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 5:22 pm Posted by : ramakrishna

వెల్ నెస్ సెంటర్లో డాక్టర్లు లేరు, మందులు లేవు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం నిజామాబాదులో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ లో డాక్టర్లు అందుబాటులో లేక దాదాపు రోజుకు 200 మంది లబ్ధిదారులు (రిటైర్డ్ ఉద్యోగులు) అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆల్ పెన్షనర్స్ జిల్లా అధ్యక్షులు శిర్ప హనుమాన్లు అన్నారు. డాక్టర్లను నియమించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై వెంటనే చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అనేక రోజులుగా డాక్టర్లు అందుబాటులో లేరని, ఈ విషయమై సంబంధిత అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన ఎలాంటి ఫలితం కనిపించడం లేదని, గత్యంతరం లేని పరిస్థితుల్లో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ పెన్షనర్స్ జిల్లా అధ్యక్షులు శిర్ప హనుమాన్లు, ప్రధాన కార్యదర్శి ఈవిల్ నారాయణ, కోశాధికారి లావు వీరయ్య, నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి సాంబశివరావు, జిల్లా నాయకులు ప్రసాదరావు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.