వారి సిబిల్ జీరో..?

బతుకమ్మ, నిజామాబాద్ : లోన్లు తీసుకుని బ్యాంకు అధికారులను తమ చుట్టూ తిప్పించుకున్న ఖాతాదారుల గురించి విన్నాం కానీ.. రుణం తీసుకోకున్నా బ్యాంకు బాధితులుగా మారిన 42 మంది గోడును పట్టించుకునే లేకుండాపోయారు. తమ పేర్లపై రుణాలు తీసుకున్న యూనియన్ బ్యాంకు మేనేజర్ పై సంబంధిత ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించినప్పటికీ తమ పేర్లను నాన్ పెర్ఫార్మింగ్ (ఎన్ పీ) జాబితా నుంచి తొలగించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని బడాబజార్ యూనియన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ అజయ్ 42మంది ఖాతాదారులకు రుణాలు...