Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 March 2025, 5:10 pm Posted by : ramakrishna

జల్సాలకు అలవాటు పడి చోరీలు

  • ఒకరి అరెస్టు.. మూడు ద్వి చక్రవాహనాలు స్వాధీనం

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న ఒకరిని ఐదో టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ బి.శ్రీనివాస్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. నందిపేట్ మండలంలోని కసబ్ గల్లీకి చెందిన షేక్ అహ్మద్ మేస్త్రీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. గతం లో అతను కొంతకాలం  స్రీల గాజులను చుట్టుప్రక్కల ఏరియా లలో అమ్ముతు జీవించేవాడు.  ఆ పని చేయగా వచ్చిన డబ్బులు అతని కుటుంబ అవసరాలకు, జల్సా లకు సరిపోకపోవడం వలన అతను మోటార్ సైకిల్ లను దొంగతనం చేసి వాటిని మహారాష్ట్రలో, చుట్టుప్రక్కల ఏరియాలలో అమ్మి వేసి  అలా అమ్మిగా వచ్చిన డబ్బులను అతని జల్సాలకు వాడుకోవాలని అనుకున్నాడు. అదే  క్రమంలో వాహనాలను దొంగిలించి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. ఈ క్రమంలో నాగారంలోని బ్రాహ్మిన్ కాలనీకి చెందిన లాడేవాడ్ లక్ష్మీకాంత్ ఈనెల 25న తన ఆటో ఎవరో దొంగిలించారని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా సీసీ టీవీలను పరిశీలించగా నిందితుడిని గుర్తించారు. నిందితుడిని నగరంలోని న్యాల్కల్ ఎక్స్ రోడ్డులోని రేడియో స్టేషన్ వద్ద ఐదో టౌన్ ఎస్ఐ ఎం.గంగాధర్ అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి మూడు ద్వి చక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు చేధించిన ఐదో టౌన్ ఎస్ఐ  ఎం. గంగాధర్, సిబ్బందిని నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాస్ అబినందిచారు.