Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 November 2024, 9:51 pm Posted by : ramakrishna

రెండిళ్లలో చోరీ 

నగదు వెండి ఆభరణాలు అపహరణ

బతుకమ్మ, మాచారెడ్డి:  తాళం వేసి ఉన్న రెండిళ్లలో దొంగలు తాళం పగలగొట్టి నగదు వెండి ఆభరణాలను దొంగిలించారు.  పాల్వంచ మండలం మంథని దేవుని పల్లి గ్రామానికి చెందిన చాట్ల రాజు  తాళం వేసి మాచారెడ్డి లో బంధువుల ఇంటికి వెళ్లారు.  సోమవారం ఉదయం  ఇంటికి వచ్చి చూడగా తన ఇంటి తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువా పగలగొట్టి అందులో దాచి ఉంచిన 40 వేల నగదు తో పాటు నాలుగు తులాల వెండి పట్టగొలుసులు  గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించుకు పోయారు.  అదే గ్రామానికి చెందిన నెత్తట్ల సత్తయ్య ఇంట్లో కూడా తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న 5 వేల రూపాయలను ఎత్తుకెళ్లారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు.