ల్యాబ్ లో చోరీ

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరంలోని ఖలీల్ వాడీలో ఉన్న గౌతమి పాథొలాజికల్ ల్యాబ్ లో చోరీ జరిగింది. షట్టర్ తాళలు పగులగొట్టిన దుండగులు ల్యాబ్ లోకి ప్రవేశించి రూ.10వేల నగదు ఎత్తుకెళ్లారు. ఒకటో టౌన్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.