ఆలయాల్లో చోరీ
వర్ని, బతుకమ్మ: వర్ని మండలం జలాల్ పూర్ గ్రామంలోని రెండు ఆలయాల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. మల్లికార్జునస్వామి, కృష్ణ దేవాలయం లో చోరీ కి పాల్పడిన దొంగలు సుమారు 5 తులాల బంగారం, 25 తులాల వెండితోపాటు హుండీలోని రూ.70,000 నగదును ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.