నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని 4వ టౌన్ పరిధిలో గల సంజీవరెడ్డి కాలనీలో గురువారం పట్టపగలు చోరి జరిగింది. శ్రీనివాస్ అనే వ్యక్తి పూజల నిమిత్తం గుడికి వెళ్లగా తాళాలు పగులగొట్టి అగంతకులు చోరికి పాల్పడ్డారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం వారు ఇంటికి తిరిగి రావడంతో వెలుగు చూసింది. అగంతకులు తాళాలు పగులగొట్టి పడకగదిలోని బీరువాను పగులగొట్టి 5 తులాల బంగారం, 7 వేల నగదు చోరి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు 4వ టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.