రాజంపేట, బతుకమ్మ : రాజంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రాజంపేట గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తుల ఒకరి ఇంట్లో దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజంపేట గ్రామానికి చెందిన మాణిక్య రాజమణి ఈనెల 5న కామారెడ్డిలో నివాసం ఉండే తన కూతురు ఇంటికి వెళ్లింది. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం ఇంటి తాళం పగుల గొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఇంటిలోని బీరువాలో దాచిన మూడున్నర తులాల బంగారం నెక్లెస్, రూ.10వేల నగదు ఎత్తుకెళ్లారు. బాధితురాలు మాణక్య రాజమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.