Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 December 2025, 7:14 pm Posted by : ramakrishna

 పట్టపగలు శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో చోరీ

 

. . . పూజా సామగ్రిని ఎత్తుకెళ్లిన దొంగ

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ నగరం లోని ప్రసిద్ధ శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో  పట్టపగలే చోరి జరిగింది. ఆలయంకు వాచ్ మెన్ తో పాటు సీసీ కెమోరాలు ఉండగా బుధవారం పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించి నిత్యం పూజకు వినియోగించే ఇత్తడి, రాగి సామాగ్రిని ఎత్తుకెళ్లాడు. సాయంత్రం  7 గంటల ప్రాంతంలో ఆలయానికి వచ్చిన పూజారి పరిశీలించే వరకు చోరి గురించి తెలియరాలేదు. సీసీ టివి పుటేజీ లను పరిశీలించి సుమారు రూ.60 వేల విలువైన సొత్తు దొంగతనం జరిగిందని రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన 2 టౌన్ పోలీసులు చోరీకి పాల్పడిన వ్యక్తి కోసం సీసీ టివి పుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు.

Theft in broad daylight at Shambhu Lingeshwara Swamy Temple