Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 7:13 pm Posted by : ramakrishna

బీడీ వర్కర్స్ కాలనీ లో చోరీ

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో మంగళవారం ఆర్టీసీ కండక్టర్ నివాసంలో గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి 12 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.10 వేల నగదును అపహరించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Theft in Beedi Workers' Colony