తాళం వేసిన ఇంట్లో చోరీ
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్ గ్రామానికి చెందిన బైరం జెకోబ్ కూలి పని చేసుకుంటూ జీవిస్తాడు. అంకుల్ క్యాంప్ నందు నివాసం ఉంటున్న ఇతని కుమారుడికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో వారం రోజుల క్రితం ఇతను, ఇతని భార్య తమ ఇంటికి తాళం వేసి కుమారుడని చూడటానికి వెళ్లి అక్కడే ఉన్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు ఇతని ఇంటి తాళాలు పగలగొట్టబడి ఉన్నవి అని ఇతని తమ్ముడు శ్రీనివాస్ తన అన్నకు సమాచారం అందించాడు. జెకోబ్, తన కుటుంబ సభ్యులు వచ్చి...