గార్మేంట్స్ షాపులో చోరి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో దోంగలు మరోసారి రెచ్చిపోయారు. నగరంలోని జవహర్ రోడ్డు( పూసలగల్లి) లో చోరికి పాల్పడ్డారు. సోమవారం రాత్రి జేడి గార్మేంట్స్ షాపు షట్టర్లను రాడ్లతో లేపి చోరికి పాల్పడ్డారు. రెడిమేడ్ బట్టలతో పాటు సెల్ పోన్ చోరికి పాల్పడినట్లు తెలిసింది. మంగళవారం ఉదయం ఈ విషయం వెలుగు చూసింది . షాప్ యజామాని జావీద్ పిర్యాదు మేరకు ఓకటవ టౌన్ పొలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.