ఎల్లారెడ్డి వైన్స్ లో చోరీ

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని త్రిశూల్ వైన్స్ నడిపే మహేందర్ గౌడ్ ఆదివారం రోజు దిరిగానే ఉదయం వైన్స్ షాప్ తీసి రాత్రి షాపును మూసివేసి ఇంటికి వెళ్ళాడు. తిరిగి సోమవారం ఉదయం షాప్ తీసి చూడగా షాపులో వస్తువులు చిందరవందరగా పడి ఉండి షాప్ లోనే క్యాష్ కౌంటర్లో లోని డబ్బులు సుమారు 15 వేల నగదు దొంగిలించబడి ఉన్నాయని మహేందర్ గౌడ్ ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.