బోధన్‌లో స్వయంభు రామ లక్ష్మణ మందిరంలో దొంగతనం

  బోధన్, బతుకమ్మ :   బోధన్ పట్టణంలోని 14వ వార్డు గంజ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న స్వయంభు రామ లక్ష్మణ మందిరంలో శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయంలో ఉన్న సీతమ్మవారి వెండి పుస్తెలు మెట్టలను, హుండీని పగలగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై బీజేపీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపి కిషన్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు బోధన్ పట్టణ సీఐకి రాతపూర్వక ఫిర్యాదు చేశారు. దొంగలను వెంటనే...