Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 August 2025, 3:14 pm Posted by : ramakrishna

సాయిబాబా ఆలయంలో చోరీ

నిజామాబాద్ క్రై0,  బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని దుబ్బ రాజీవ్ నగర్ లో గల సాయిబాబా ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి ఆలయం ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి గుడిలో చోరీకి పాల్పడ్డారు. గర్భగుడిలోని  30 తులాల వెండి కిరీటం, నాలుగు కిలోల ఇత్తడి సాయిబాబా విగ్రహం, ఇతర సామాగ్రి తో పాటు ఇంటెక్స్ సౌండ్ బాక్స్ ను ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో మూడో టౌన్ పోలీస్ లకు సమాచార అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Theft at Sai Baba temple