హింగూళాంబిక ఆలయంలో చోరీ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని మూడో టౌన్ పరిధిలో గల ప్రసిద్ధ హింగూళాంబిక ఆలయంలో చోరీ జరిగింది. ఈ సంఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు అదివారం రాత్రి ఆలయ తలుపుల తాళాలు పగులగోట్టి లోనికి ప్రవేశించి, అమ్మవారు విగ్రహాంపై ఉన్న మూడున్నర తులాల బంగారు అభరణాలను చోరీ చేశారు. నగలతో పాటు ఆలయంలో సీసీ పుటేజీ కలిగిన డీవీఆర్ ను ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయం పాలక మండలి సభ్యుల ఫిర్యాదు మేరకు మూడో టౌన్ ఎస్ఐ హరి...