Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 2:34 pm Posted by : ramakrishna

తీర్మాన్ పల్లిలో ఇంటిలో చోరీ

_రెండు తులల బంగారం చోరీ

ఇందల్వాయి , బతుకమ్మ :

ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని  మండల కేంద్రంలో గల తీర్మాన్ పల్లి రేణుక ఎల్లమ్మ ఆలయ సమీపంలో గల కుమ్మరి శ్రీనివాస్ ఇంటిలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు ఇంటికి వేసిన తాలాన్ని పగలగొట్టి ఇంట్లోకి దూరి బీరువాను బద్దలు కొట్టి బీరువాలో ఉన్నటువంటి విలువైన వస్తువులతో పాటు రెండు తులల బంగారాన్ని అపారించుకుపోయారని బాధితులు ఇందల్వాయి పోలీసులకు తెలియజేశారు, ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కుమ్మరి శ్రీనివాస్ తండ్రి గంగారం అనారోగ్యానికి గురి కావడంతో నిజామాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దీంతో గంగారాం నివాసం ఉంటున్న ఇంటికి తాళం వేసి ఉండడంతో గుర్తుతెలియని దుండగులు తాళం వేసిన ఇంటికి కన్నం పెట్టారు. చుట్టూ కుమర్ల ఇండ్లకు బయట నుండి  గోళ్లం పెట్టిన దొంగలు గంగారం నివాసముంటున్న ఇంట్లోకి దూరి బీరువాను బద్దలు కొట్టి బీరువాలో ఉన్న విలువైన సామాగ్రితో పాటు బంగారు వస్తువులను దొంగలించారని కుమ్మరి శ్రీను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇందల్వాయి ఎస్సై సుమలత సంఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించారు.అనంతరం నిజామాబాద్ నుండి క్లూస్ టీం తొ వేలిముద్రలను స్వీకరించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సుమలత తెలిపారు.

Theft at a house in Teermanpalli