. . . నిజామాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన సంస్థగా యువజన కాంగ్రెస్ నిలిచిందని, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిజామాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ తెలిపారు. ఆదివారం యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ అధ్యక్షుడు శరత్ కుమార్, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విపుల్ గౌడ్ మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు మహాత్మా గాంధీ దేశ ప్రజలను ఏకం చేసి స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించారని తెలిపారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ చరిత్రను చెరిపివేసే విధంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడంలో యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని విపుల్ గౌడ్ పేర్కొన్నారు. యువత సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజారెడ్డి, యాదగిరి, ప్రవీణ్ గౌడ్, రాజేంద్ర ప్రసాద్, సుధాకర్, ఖుద్దూస్, వాహీద్, ప్రమోద్, మొయీన్ యూనస్, సంతోష్, బలరాం, పోల ఉష, రవి, గంగారెడ్డి, రఘువీర్, అనుపాల్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.