నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: పార్టీకి యువజన కాంగ్రెస్ పునాది వంటిదని ఆ విభాగం నాయకులు అన్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా యువజన కాంగ్రెస్ కార్యాచరణ రూపొందిస్తోందన్నారు. ఇందులో భాగంగా నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్ లో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ అధ్యక్షతన మొదటి జిల్లా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ చార్జీలు రంగనాథ్, వెంకట రామారావు హాజరై మాట్లాడారు. పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు ముందుండాలన్నారు. రానున్న స్థానికసంస్థల ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు అవకాశం ఇవ్వాలని తీర్మానం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
పార్టీ చేపడుతున్న ‘జై బాపు జై భీం జై సంవిధాన్’ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ కీలకపాత్ర పోషించాలని అన్నారు . సమావేశంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శులు విక్కీ యాదవ్, నరాల నిహార్, జిల్లా ఉపాధ్యక్షులు అనుపాల్ కిరణ్, ప్రధానకార్యదర్శులు నరేందర్ గౌడ్, ఆదిత్య పాటిల్, ఇర్ఫాన్, రాజుగౌడ్, రషీద్, ముద్దసీర్, నియోజకవర్గ అధ్యక్షులు, మండలాల అధ్యక్షులు, కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు .