అన్నను చంపిన తమ్ముడు
భిక్కనూరు, బతుకమ్మ: కుటుంబ కలహాలతో అన్నను తమ్ముడు హత్య చేసిన ఘటన భిక్కనూరు మండలం మోటాట్ పల్లి గ్రామంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం గ్రామానికి చెందిన రాజును తన సోదరుడు శివకుమార్ కుటుంబ కలహాలతో తెల్లవారుజామున గొడ్డలితో నరికి హత్య చేశాడు. సమాచారం అందుకున్న భిక్కనూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి హత్య చేసిన శివకుమార్ ను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్ కు తరలించారు. ఏఎస్పీ చైతన్య రెడ్డి ఘటన స్థలాన్ని...