ఉరేసుకొని యువకుడు మృతి

రాజంపేట: బతుకమ్మ : రాజంపేట మండలంలోని షేర్ శంకర్ తండా గ్రామంలో  ఓ యువకుడు  ఉరివేసుకొని మృతి చెందినట్లు ఎస్సై  పుష్ప రాజ్ తెలిపారు.  ఆయన తెలిపిన వివరాలు ప్రకారం.. షేర్ శంకర్ తండా కు చెందిన  కాట్రోత్ శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం  ఉరి వేసుకొని చనిపోయినట్లు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి కామారెడ్డికి తరలించినట్లు పేర్కొన్నారు.  కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆయన తెలిపారు.