పని మీది..  ధర నాది..

లోడు పెరిగితే బరువు పెరగాల్సిందే విద్యుత్ అధికారుల తీరుతో రైతుల బెంబేలు   నిజామాబాద్, బతుకమ్మ: దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించడు అన్న చందంగా తయారయ్యింది విద్యుత్ శాఖా పరిస్థితి. నిబంధనల ప్రకారం సంస్థకు చెల్లించాల్సిన వాటిని డిడి రూపంలో జమ చేస్తున్నారు. వ్యవసాయం నిమిత్తం వినియోగించే విద్యుత్ ను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుంది. దీనికి అవసరమయ్యే ట్రాన్స్ఫార్మర్ తో పాటు పరికరాలను రాయితీపై అందజేస్తుంది. అయినప్పటికీ డబ్బులు ముట్టనిదే పని ముట్టట్లేదనే ఆరోపణలు బహిరంగం అవుతున్నాయి. అందులోనూ జక్రాన్ పల్లి మండలంలో...