ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్ తండాలో భర్తను హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. తండాలో తుకారాం, మీనా భార్య భర్తలు నివసిస్తున్నారు. తుకారాం భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈక్రమంలో భార్య మీనా ఆగ్రహానికి లోనై మంగళవారం రాత్రి తుకారాం (36) ను నిద్రలో ఉండగా మెత్తతో ముఖం నొక్కి హతమార్చింది. స్థానిక వ్యక్తి తుకారాం (36) ను అతని భార్య మీనా నిద్రలో ఉండగా మెత్తతో ముఖం నొక్కి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలు, భర్త వేధింపులు కారణంగా తీవ్ర మనోవేదనకు గురైన భర్తను హత్య చేసినట్లు బంధువుల సమక్షంలో మీనా ఒప్పుకుంది. అనంతరం అక్కడి నుంచి పారిపోయిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్లారెడ్డి సీఐ దొరవారి రాజిరెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కార్యక్రమంలో ఎస్సై బొజ్జ మహేష్, ఎస్సై సుబ్రహ్మణ్య చారి, కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
