భర్తను చంపిన భార్య
వెబ్ న్యూస్, బతుకమ్మ : భర్తను భార్య హతమార్చిన ఘటన ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చింతపల్లి మండలం మేడూరు గ్రామంలో ఫోన్ ఎక్కువగా మాట్లాడొద్దన్నందుకు గొడ్డలితో భర్త పై భార్య దాడి చేసింది. స్థానికులు అతడిని విశాఖ కేజీహెచ్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.