Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 4:59 pm Posted by : ramakrishna

ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం

 

. . . మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మొహమ్మద్ నగర్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి అన్నారు. మొహమ్మద్ మండల కేంద్రంలో బూర్గుల్ గ్రామ పంచాయతీ పరిధిలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై ఇందిరమ్మ ఇల్లు రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు పథకం పేద కుటుంబాలకు ఆశాకిరణంగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు రమేష్, నర్సింలు, అతిక్, హరిన్, జీవన్, ఆకాష్, సాయ్ గౌడ్, ఏఐబిఎస్ఎస్ అధ్యక్షులు గోపి పాల్గొన్నారు.