. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
సమాజంలో అనాధ వృద్ధుల సంక్షేమం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వారిని ఆదుకోవడం ద్వారా మనుష్యత్వాన్ని చాటుకోవచ్చని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ టౌన్ 6 పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రి నగర్ లో గల నిర్మల్ భవన్ లో అనాధ వృద్ధాశ్రమాన్ని సోమవారం సీపీ సందర్శించారు. అక్కడ నివసిస్తున్న అనాధ వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.

అనంతరం వృద్ధులతో ఆత్మీయంగా మాట్లాడి, వారి ఆరోగ్యం, అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్న సహాయం కూడా వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని, అందరూ సేవాభావంతో ముందుకు రావాలని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఇన్ చార్జి ఏసిబి రాజా వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, సౌత్ రూరల్ సీఐ సతీష్ కుమార్, ట్రాఫిక్ సిఐ ప్రసాద్, ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్ పెక్టర్ వినోద్, టౌన్ 6 ఎస్ఐ వెంకట్ రావ్, గ్రామ సర్పంచ్ నరాల జ్యోతి, నిర్మల్ భవన్ సిస్టర్ రోసుమ్మ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
