కన్నుల పండుగగ స్వామి వారి కళ్యాణం
బతుకమ్మ, భిక్కనూరు: చారిత్రక ప్రాధాన్యం పౌరాణిక గాధ కలిగిన సిద్ధ రామేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం స్వామివారి కల్యాణం కన్నుల పండగగా జరిగింది. దక్షిణ కాశి సిద్ధరామేశ్వరాలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అలంకరించిన ముత్యాల పందిట్లో స్వామివారి ఉత్సవ విగ్రహాలను పెట్టి ఆలయ అర్చకులు కొడగండ్ల రామగిరి శర్మ, కోడగండ్ల సిద్ధ రామ శర్మ, కొడగండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణ ఘట్టాన్ని జరిపించారు. స్వామివారి కల్యాణ మండపం భక్తుల రద్దీతో నిండిపోయింది. పార్వతి సమేత సిద్ధారామేశ్వర స్వామి...