Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 March 2025, 7:30 pm Posted by : ramakrishna

కన్నుల పండుగగ స్వామి వారి కళ్యాణం

బతుకమ్మ, భిక్కనూరు: చారిత్రక ప్రాధాన్యం పౌరాణిక గాధ కలిగిన సిద్ధ రామేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం స్వామివారి కల్యాణం కన్నుల పండగగా జరిగింది. దక్షిణ కాశి సిద్ధరామేశ్వరాలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అలంకరించిన ముత్యాల పందిట్లో స్వామివారి ఉత్సవ విగ్రహాలను పెట్టి ఆలయ అర్చకులు కొడగండ్ల రామగిరి శర్మ, కోడగండ్ల సిద్ధ రామ శర్మ, కొడగండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణ ఘట్టాన్ని జరిపించారు. స్వామివారి కల్యాణ మండపం భక్తుల రద్దీతో నిండిపోయింది. పార్వతి సమేత సిద్ధారామేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగినంత సేపు కళ్యాణం లో కూర్చున్న భక్తులు స్వామివారిని స్మరించుకున్నారు దేవత మూర్తులైన పార్వతి మెడలో పరమేశ్వరుడు మూడు ముళ్ళు వేసి కళ్యాణ క్రతువును రెండు గంటల పాటు భక్తులు ఓపిక కూర్చొని తిలకించారు. అనంతరం దేవతమూర్తుల ఒడి బియ్యం పోసేందుకు చాలాసేపు మండపంలో కూర్చోవలసి వచ్చింది దీంతో భక్తులు కనీస సౌకర్యాలు లేవని భక్తులు ఆలయ ఈవో పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి దర్శించుకున్న అనంతరం అన్న ప్రసాద  కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ అందే మహేందర్ రెడ్డి, పీఠాధిపతి సిద్ధగిరి సదాశివ మహంత్, మాజీ సర్పంచ్ తునికి వేణు ఆలయ ఈవో శ్రీధర్ భక్తుల పాల్గొన్నారు.

The wedding of the Lord is a feast for the eyes.