Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 October 2025, 7:47 pm Posted by : ramakrishna

కన్నుల పండుగగా శ్రీ రుక్మిణి  శ్రీకృష్ణుని కళ్యాణం 

  • శుక్రవారంతో ముగిసిన సత్సంగ సదనం 65వ వార్షికోత్సవ వేడుకలు
  • బ్రహ్మ శ్రీ డా” గర్రెపల్లి  మహేశ్వర శర్మ

 

 ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ:  ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని  సత్సంగ సదనంలో   65 వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం  తో ముగిశాయి.శ్రీ రుక్మిణి  శ్రీకృష్ణ కళ్యాణం కన్నుల పండుగ గా జరిగాయి.ఈనెల 24వ తేదీన వేడుకలను సత్సంగ సదనం శ్రీ శ్రీ శ్రీ సరస్వతి గోవిందా రాజు చారి ట్రబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సత్సంగ సదనం అధ్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి  ప్రారంభించారు. బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి  ప్రియ శిష్యులు బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర్ శర్మ చే   శ్రీ జగద్గురు శ్రీ శృంగేరి శారదా పీఠాధిశ్వరుల దివ్య ఆశీస్సులతో శ్రీమద్భాగవత సప్తహ జ్ఞాన యజ్ఞం లో భాగంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను కళ్ళకు కట్టినట్లు భక్తులకు బోధించారు.  ప్రతినిత్యం ఉదయం ఆరు గంటల నుండి 8 గంటల వరకు ప్రభాతభేరి గీతా పారాయణం సూర్య నమస్కారములు సాయంత్రం ఏడు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు  భగవద్గీత ఉపన్యాసాలు  ప్రబోధములు సత్సంగ సదనం అధ్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి   భక్తులకు బోధించారు.చివరి రోజైన శుక్రవారం  బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర శర్మ ని సత్సంగ సదనం అధ్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి  కార్యదర్శి శ్రీనివాసు గుప్తా ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో   వేములవాడ సత్సంగ సదనము నిర్వాహకులు భూపతి , భక్త సంఘం ప్రతినిధులు బ్రహ్మశ్రీ రఘురాం శర్మ, బ్రహ్మశ్రీ రాచర్ల దయానంద శర్మ, భక్త సంఘం ప్రతినిధులు రామ్ రెడ్డి,  గుండం రాజు రెడ్డి, అనంత రెడ్డి,కిషన్ రెడ్డి, నారాయణరెడ్డి,ద్యాప దేవయ్య యాదవ్, గంప నాగేంద్రం గుప్తా, బొమ్మ కంటి రాజయ్య గుప్తా , నగుబోతు లక్ష్మీనారాయణ గుప్తా, రాము గుప్తా, దుబ్బ విశ్వనాథం గుప్తా, అంజక్క, ఇందిరా రాణి , ఒగ్గు లక్ష్మి యాదవ్,బండారి బాల్రెడ్డి, నంది కిషన్, మేగి నరసయ్య, గన్న పద్మారెడ్డి,బండ లింగంపల్లి వెంకట్ రెడ్డి,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

The wedding of Sri Rukmini and Sri Krishna is a feast for the eyes.