Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 June 2025, 6:16 pm Posted by : ramakrishna

అంగరంగ వైభవంగా ఇందూరు తిరుమలలో స్వామి వారి కళ్యాణం

 

 మోపాల్, బతుకమ్మ:

స్వామి వారి కళ్యాణం అంటే లోక కళ్యాణం. స్వామి వారి కళ్యాణం చూస్తేనే సకల పాపాలు పోతాయి..శ్రవణ నక్షత్రం సందర్భంగా ఇందూరు తిరుమల నర్సింగ్ పల్లి ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం జరిగిన స్వామి వారి కల్యాణం లో పాల్గొంటే కన్యాదాన ఫలం వస్తుందని ఆచార్య సంపత్ కుమార స్వామి  అన్నారు. భక్తుల సౌజన్యంతో సామూహికంగా స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక నుంచి ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున తొమ్మిది గంటలకు అవకాశం ఇచ్చి వారితో స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తామని ఆలయ ప్రధాన ధర్మ కర్త నర్సింహా రెడ్డి తెలిపారు.  స్వామీ వారి కళ్యాణం కోసం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో పరిసరాలు భక్తులతో నిండి పోయింది. ఈ కార్యక్రమంలో రోహిత్ కుమారాచార్య, నరాల సుధాకర్, విజయ్, అనిల్, నర్సిరెడ్డి, పృథ్వీ, భాస్కర్, సాయిలు, నరేష్,  మురళి, తదితరులు పాల్గొన్నారు.

The wedding of Lord Swami at Tirumala, Indore, was held in grandeur.