Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 November 2025, 7:30 pm Posted by : ramakrishna

కళ్యాణం కమణీయం

  • కన్నుల విందుగా శ్రీలక్ష్మీవేంకటేశ్వరుని
  • వైభవంగా స్వామి ఉంజల్ సేవా

 

భీమ్ గల్, బతుకమ్మ : చొక్కాయ్యగుట్ట శ్రీలక్ష్మీవేంకటేశ్వరుల కళ్యానాన్ని అర్చకులు కన్నుల విందుగా జరిపించారు. మార్గశిర మాసంలో ప్రతి యేటా నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నంబి వాసుదేవాచార్యుల అర్చక బృందం స్వామి వారి కల్యాణ క్రతువులో భాగంగా ముందుగా అమ్మవారిని, స్వామి వారికి ఎదురుకోలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి కన్యాధానంలో భాగంగా స్వామి పాధాలను కడిగారు. భక్తుల గోవింద నామస్మరణ మధ్య తాళి బొట్టును భక్తులకు చూపించి అర్చకులు వేదోక్త మంత్రాలు, భాజా భజన్త్రీలు, మేళా తాళలా చప్పుల్ల మధ్య లక్ష్మి శ్రీనివాసుల కళ్యాణాన్ని కమనీయంగా, రమనీయంగా నిర్వహించారు.స్వామి కల్యాణమనంతరం భక్తులకు స్వామి మంత్రాక్షింతాలను అర్చకులు అందించి ఆశీర్వదించారు. సాయంత్రం 6 గంటలకు స్వామి వారికి ఉంజల్ సేవాను అర్చకులు వైభవంగా జరిపించారు. ఈ సందర్బంగా మహిళాలు సహస్ర దీపోత్సవ కార్యక్రమం లో భాగంగా దీపాలను వెలిగించారు. అనంతరం నాగవాళ్లి కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్బంగా బొదిరే సంఘ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ను నిర్వహించారు. స్వామి వారి కళ్యాణనికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్, స్థానిక పట్టణ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

The wedding is beautiful.