లక్కపురుగులపై మూడు గ్రామాల ప్రజల యుద్ధం
. . . లక్కపురుగులకు కారణమైన గోదాముల ఎదుట గ్రామస్థుల ధర్నా . . . పొలిసుల హమీతో ఆందోళన విరమణ కామారెడ్డి , బతుకమ్మ: బియ్యం లేదా పిండి పధర్థాలను సరైన పద్ధతిలో నిల్వ ఉంచకపోతే తయారు అయ్యే నల్లటి కిటకమైన లక్కపురుగులు కామారెడ్డి జిల్లాలో మూడు గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. లక్క పురుగులు ఇండ్లల్లోకి వస్తున్నాయని, తినే తిండిలో , త్రాగే నీళ్లలో, చివరకు పడుకుంటే చిన్నపిల్లల చెవులల్లకు వెళ్తున్నాయని కామారెడ్డి జిల్లాలో కీటకాల వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్రజలు వాటిపై యుద్ధం ప్రకటించారు. బుధవారం రామారెడ్డి మండలం మోశంపూర్ , ఉప్పల్ వాయి...