Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 1:49 pm Posted by : ramakrishna

లక్కపురుగులపై మూడు గ్రామాల ప్రజల యుద్ధం

. . . లక్కపురుగులకు కారణమైన గోదాముల ఎదుట గ్రామస్థుల ధర్నా

. . . పొలిసుల హమీతో ఆందోళన విరమణ

 కామారెడ్డి , బతుకమ్మ:

బియ్యం లేదా పిండి పధర్థాలను సరైన పద్ధతిలో నిల్వ ఉంచకపోతే తయారు  అయ్యే నల్లటి కిటకమైన లక్కపురుగులు  కామారెడ్డి జిల్లాలో మూడు గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. లక్క పురుగులు ఇండ్లల్లోకి  వస్తున్నాయని, తినే తిండిలో , త్రాగే నీళ్లలో, చివరకు పడుకుంటే చిన్నపిల్లల చెవులల్లకు  వెళ్తున్నాయని కామారెడ్డి జిల్లాలో కీటకాల వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్రజలు వాటిపై యుద్ధం  ప్రకటించారు. బుధవారం రామారెడ్డి మండలం మోశంపూర్ , ఉప్పల్ వాయి గ్రామాల మధ్యలో గల గోదాముల నుంచి లక్క పురుగులు వస్తున్నాయని ఉప్పల్ వాయి , మోషం పూర్, పోసానిపేట గ్రామాలకు  చెందిన ప్రజలు ప్రైవేట్ గోదాముల ముందు ధర్నా నిర్వహించారు.

The war waged by the people of three villages against lac insects

ప్రైవేట్ గోదాముల నిర్వహకుల నిర్వహణ వైఫల్యం కారణంగా లక్కపురుగులు గోదాములు దాటి గ్రామాలలో తమ ఇండ్లలోకి వచ్చి తీవ్ర సమస్యలను తెచ్చిపెడుతున్నాయని గ్రామస్థులు ఆరోపించారు. ప్రధానంగా కీటకమైన లక్కపురుగుల వలన ఇండ్లలో ఇక్కట్లు ఎదుర్కుంటున్నామని తెలిపారు. గోదాములలో కిటకాలు వ్రుద్ధి చెందకుండా చేపట్టాల్సిన చర్యలు చెపట్టకపోవడం అసలు సమస్య అని తెలిపారు. విషయం తెలిసిన సధాశివనగర్ సిఐ శ్రీధర్ గౌడ్ గ్రామస్థులతో మాట్లాడి నిరసనను విరమింప చేశారు. గోదాముల నిర్వహకులతో చర్చించి లక్కపురుగుల వ్రుద్ధికి చెక్ పెట్టాలని సూచించారు. దానితో మూడు గ్రామల ప్రజలు లక్కపురుగుల సమస్య తాత్కలికంగా కోలిక్కి వచ్చినట్టయింది. రెండు వేళ్లతో నలిపితే చచ్చిపోయే చిన్న పురుగుల పై మూడు గ్రామాల ప్రజల నిరసన చర్చనీయాంశంగా మారింది.

The war waged by the people of three villages against lac insects