Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 October 2024, 11:01 pm Posted by : ramakrishna

వక్ఫ్ బోర్డు బిల్లును అడ్డుకునేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తా

. . .  అసదుద్దీన్ వెంట ఐదారుగురు ఎంపీలు  ఉంటే వక్ఫ్ బోర్డు బిల్లు పెట్టే వారు కాదు

. . . పాలస్తీనా యుద్దపరిస్థితులను చూసైనా మనలో ఐక్యత రావాలి

. . . మోడి, భగవత్ లది విద్వేషాల ఏజండా

. . . ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

నిజామాబాద్, బతుకమ్మ   :                                                                                                                                                                                                                                                                                                                                                                  దేశంలో తరతరాలుగా ఉన్న వక్ఫ్ ఆస్తుల విషయంలో కేంద్ర  ప్రభుత్వం తీసుకువస్తున్న వక్ఫ్ బోర్డు బిల్లును రద్దు  చేసే వరకు తన శక్తి మేరకు ప్రయత్నిస్తానని  హైదరాబాద్ ఎంపీ,  ఎంఐఎం  అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో సమకాలిన రాజకీయ పరిస్థితులు  అనే అంశంపై బహిరంగ  సభ  జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన అసదుద్దీన్ మాట్లాడుతూ పార్లమెంట్ లో అసదుద్దీన్ తో పాటు మరో ఐదారుగురు ఎంపీలు, ఎంఐఎం పార్టీ వారు ఉంటే  పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు బిల్లు  పెట్టేవారు కాదన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లు అమలైతే గుజరాత్ లోని సోమనాథ్ లో గల 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన హజ్ మంగళ్ షా దర్గా , మజీద్ కూల్చివేతకు గురయ్యే పరిస్థితి దాపురించిందన్నారు. ఇప్పటికే అక్కడి జిల్లా కలెక్టర్ గత నెల 28న చారిత్రాత్మక కట్టడాన్ని కూల్చివేయాలని ఆదేశించారన్నారు. వక్ఫ్ బోర్డులో ఉన్న వక్ప్ బై యూజర్ అనే పదం కేవలం ఒక్క వక్ప్ బోర్డులో ముస్లీంలకే  కాదని అందరికీ ఉపయోగడాలని ఉందని దానిని గమనించాలన్నారు. పది  సంవత్సరాల మోడి పాలనలో జరిగిన డెవలప్ మెంట్ శూన్యమని అన్నారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన భగవత్ సూచనల మేరకు ప్రధాని మోడి ప్రజల మధ్య విధ్వేషాల ఏజండాను మాత్రమే అమలు చేస్తున్నారన్నారు. పాలస్తీనా యుద్దం ప్రారంభమై ఏడాది గడిచిందని అక్కడ ఉన్న ఆక్సా మజీద్ అనేది సున్నీలదో, షియాలదో కాదని ముస్లీంలదని గుర్తించి ఐక్యం కావాలన్న ఆవశ్యకత ఉందన్నారు. హైడ్రా అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం సెక్రటేరియట్ తో పాటు ప్రముఖ కట్టడాలన్నీ చెరువు శిఖంల భూముల్లోనే ఉన్నాయని వాటిని కూల్చకుండా మూసి పరివాహక ప్రాంతంలోని పేద ఇళ్ళను ఎలా కూల్చుతారని అసదుద్దీన్ ఓవైసి ప్రశ్నించారు. ఈ సమావేశానికి నిజామాబాద్ ఇంచార్జి, మలాక్  పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాల, జిల్లా అధ్యక్షులు షకీల్, డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్,  భైంసా మున్సిపల్ చైర్మన్ జబిర్, నిజామాబాద్ నగర కార్యదర్శి షహబాజ్, మాజీ డిప్యూటి మేయర్ మీర్ మజాజ్ ఆలీ, ఫయాజుద్దీన్, అమర్, రఫత్ ఖాన్, ఎంఐఎం కార్పొరేటర్లు ఉన్నారు.