Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 October 2024, 4:28 pm Posted by : ramakrishna

అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు

నిజామాబాద్, బతుకమ్మ : మోపాల్ మండలంలోని  బైరాపూర్ గ్రామంలో 21వ ప్యాకేజీ పంప్ హౌస్ పనుల కోసం సర్వే చేయడానికి వచ్చిన అధికారులను గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా సర్వే చేస్తారని మండిపడ్డారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రాజెక్ట్ డిజైన్‌పై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులను సర్వేకు పంపడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ డీఈ వచ్చి సముదాయించినా రైతులు వినకపోవడంతో అధికారులు సర్వే చేయకుండానే వెనుదిరిగారు.