Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 1:57 pm Posted by : ramakrishna

రసవత్తరంగా గ్రామ సభ…

 

. . . గ్రామ సభలో పాలకవర్గంపై ప్రతిపక్ష నాయకుల దాడి

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం రోజున ఉదయం 10:30 గంటలకు గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు హాజరయ్యారు. గ్రామ సభకు వచ్చిన వారు కింద కూర్చోవాలి కానీ కొందరు ప్రతిపక్ష నాయకులు మేము కింద కూర్చోమని గ్రామ సభలో గందరగోళం సృష్టించి,  దూషించుకుంటూ పాలకవర్గంపై దాడికి పాల్పడ్డారని, ఈ దాడిలో కొందరికి గాయాలయ్యాయని పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు. కొందరు ప్రతిపక్ష నాయకులు ఓటమిని జీర్ణించుకోలేక గ్రామసభకు వచ్చి గ్రామ సభను రసవత్తరంగా చేయుటకు పూనుకున్నారని తెలిపారు. అనంతరం దాడి చేసిన వ్యక్తులపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తెలిపారు.

 

 

The village council was lively...