Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 May 2025, 6:16 pm Posted by : ramakrishna

గ్రామపాలన ఎంపిక పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి / నిజామాబాద్, బతుకమ్మ :ఉమ్మడి జిల్లాలో ఈ నెల 25 న జరుగనున్న గ్రామ పాలన ఎంపిక పరీక్ష ను పకడ్బందీగా నిర్వహించాలని ఉమ్మడి జిల్లా కలెక్టర్ లు కలెక్టరేట్ లో శుక్రవారం సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 25 న ఆదివారం కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో (అటానమస్) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్ష ఉదయం గం.10.30 నుండి మధ్యాహ్నం గం.1.30 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షకు జిల్లాలో 402 మంది పరీక్ష రాస్తున్నట్లు, గతంలో వి.ఆర్.ఒ , వి.ఆర్. ఏ. లుగా పనిచేసిన వారు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు ఫోటోతో కలిగిన గుర్తింపు కార్డ్ వెంట తీసుకురావాలని తెలిపారు. ఈ పరీక్ష నిర్వహనకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలనీ తెలిపారు. పరీక్ష కేంద్రంలో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. పరీక్ష జరుగు సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా చూడాలని తెలిపారు. పరీక్ష కేంద్రంలో ఏఎన్ఎం లను అవసరమైన మందులతో సహా డిప్యూట్ చేయాలని తెలిపారు. పరీక్ష హాలులోకి వెళ్ళే సమయంలో అభ్యర్థులను నిశిత పరిశీలన చేయడం జరుగుతుందని, అభ్యర్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు, గాడ్జెస్ అనుమతించబోమని తెలిపారు. ఉదయం  గం. 9.30 లకు అభ్యర్థులను పరీక్ష హాలులోకి అనుమతించడం జరుగుతుందని, 10 గంటలకు మెయిన్ గేటు మూసి వేయడం జరుగుతుందని తెలిపారు. 10.25 లకు ప్రశ్న పత్రాలు అభ్యర్థులకు పంపిణీ చేయడం,  గం. 10.30 లకు పరీక్ష ప్రారంభం అవుతుందని తెలిపారు. మధ్యాహ్నం గం.1.25 లకు హెచ్చరిక గంట మోగించబడుతుందని, చివరగా గం.1.30 లకు పరీక్ష నిర్వహణ పూర్తయి జవాబు పత్రాలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు సమయ పాలన పాటించాలని కలెక్టర్ తెలిపారు.

  • గ్రామ పాలన అధికారుల రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
  • నిజామాబాద్ అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్

గ్రామ పాలన అధికారుల నియామకం కోసం జరిగే రాత పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. రాత పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై శుక్రవారం ఆయన తన ఛాంబర్లో అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రామ పాలన అధికారుల రాత పరీక్ష కోసం చేపట్టిన చర్యల గురించి ఆయా శాఖల వారీగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా రాత పరీక్ష జరిగేలా చూడాలన్నారు. జిల్లాలో 330 మంది అభ్యర్థులు గ్రామ పాలన అధికారుల నియామక రాత పరీక్షకు హాజరు కానున్నారని, వీరికి నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా పర్యవేక్షణ జరపాలని, నియమ నిబంధనలు తు.చ తప్పకుండా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రంలోని అన్ని గదులలో అభ్యర్థులకు తగిన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.    ఈ సమావేశంలో ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా రవాణా అధికారి ఉమా మహేశ్వరరావు, ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, తహసిల్దార్ బాలరాజు, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ పవన్ తదితరులు పాల్గొన్నారు.

The village administration selection test should be conducted strictly.