Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 February 2026, 5:47 pm Posted by : ramakrishna

బాధితులపైనే అక్రమంగా వేధింపులకు పాల్పడుతున్నారు

 

. . . బిజేపీ శాసన సభ పక్ష నేత, బాన్సువాడ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎండల లక్ష్మీ నారాయణ

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

పోలీసులు బాధితుల పక్షాన నిలువకుండా రాజకీయ ఒత్తిడికి తలొగ్గి బాధితులపైనే అక్రమంగా వేధింపులకు పాల్పడుతున్నారని బిజేపీ శాసన సభ పక్ష నేత, బాన్సువాడ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎండల లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. బాన్సువాడ పట్టణంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు బాన్సువాడ బయలుదేరిన ఆయనను మార్గమధ్యంలో అంకోల్ గ్రామం లో అరెస్ట్ చేసి నిజామాబాద్ లో ఉన్న వారి ఇంటికి తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో హిందువులపైన దాడులు పెరిగాయన్నారు. దానిలో భాగంగానే బాన్సువాడ పట్టణంలో హిందువుల పైన రాళ్లదాడులు జరిగితే, దాడులు చేసిన వారిని వదిలేసి అక్రమంగా అరెస్టు చేసి హిందువులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. హిందూవుల పైన రాళ్ళ దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని, అత్యంత కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో బాన్సువాడ నియోజకవర్గ మొత్తం ఎక్కడికక్కడ నిరసనలు పెళ్ళుబుకుతాయని ఆయన పోలీసులను హెచ్చరించారు.