పలుగు పట్టిన చేతులే కలాలు పట్టి తెలంగాణ రాత మార్చాలి

  . . . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ :   ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించాలని, పలుగు, పార పట్టిన చేతులే.. కలాలు పట్టి తెలంగాణ రాత మార్చాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. చదువొక్కటే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మన జీవితాల్లో వెలుగులు నింపుతుంది. చదువే సమాజంలో ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం నింపుతుందని...