నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పీజీ ప్రవేశాలకు నిర్వహించిన వెరిఫికేషన్ ప్రక్రియ చివరి రోజు కొనసాగింది. ఇందులో భాగంగా శుక్రవారం చివరి రోజు వెరిఫికేషన్ కు విద్యార్థులు వివిధ ప్రాంతాల నుండి భారీగా తరలి వచ్చారు. అటు విద్యార్థుల సౌకర్యార్థం మాస్ కమ్యూనికేషన్(జర్నలిజం) విభాగంతో పాటు పీడీఎస్యూ, ఏబీవీపీ విద్యార్ధి సంఘాల నాయకులు సైతం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి స్వచ్చందంగా సేవలు అందించారు. విద్యార్థులకు వెరిఫికేషన్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాస్ కమ్యూనికేషన్ విభాగం విద్యార్థులు శ్రీను రాథోడ్, ప్రదీప్ జిల్లెడివార్, కార్తీక్, శివ, నరేష్, తదితరులు పాల్గొన్నారు.