Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 September 2024, 3:26 pm Posted by : ramakrishna

ఇచ్చిన తీర్పు మానసిక వేదనకు గురిచేసింది

బతుకమ్మ,మోర్తాడ్: ఎస్సీ కులాలను వర్గీకరించడం, ఎస్సీలలో క్రిమి లేయర్ విధానాన్ని పాటించాలని 1/8/24 రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 341 ఆరి్టకల్ కు వ్యతిరేకమని మాల కులాల మనోభావాలను మానసిక వేదనకు గురిచేసిందని మాల కులాల యునైటెడ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మస్త దయానంద్ అన్నారు. భారతదేశంలో ఎస్సీ రిజర్వేషన్లు ఎస్సీల అంటరానితనం కారణంగా ఇవ్వబడ్డాయని తెలిపారు. కాబట్టి అంటరానితనం ఉన్నంత సేపు ఈ దేశంలో ఎస్సీ లకు క్రిమి లేయర్వర్తించదని అందువలన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ తీర్పును రివ్యూ చేయించగలరని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గురువారం మోర్తాడ్ మండల తహసిల్ ఆఫీసులో ఆర్ ఐ రంజిత్ కుమార్ కు మెమోరండం ఇచ్చి తమ నిరసనను తెలియపరిచారు. కార్యక్రమంలో పులి అశోక్, సుందర్ రావు, రాజు పూలే ,రామచందర్, మరి రంజిత్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.