Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 8:39 pm Posted by : ramakrishna

కంచి కామకోటి సర్వజ్ఞ 71 వ పీఠం ఉత్తరాధికారిగా బాసర ఆలయ వేదపండితుడు

 

. . . దుడ్డు ఎస్విఎస్ఎస్ గణేష్ శర్మ ఋగ్వేద వేద పండితుడికి అరుదైన గౌరవం

 

. . . శుభ ఆశీస్సులను అందజేసిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అర్చక వైదిక బృందం

 

బాసర, బతుకమ్మ:

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నవరంకు చెందిన బ్రహ్మ శ్రీ దుడ్డు ధన్వంతరి దేవి దంపతులకు జన్మించిన దుడ్డు ఎస్విఎస్ఎస్ గణేష్ శర్మ ఋగ్వేద వేదపండితులు తన గురువుల వద్ద ఋగ్వేదాన్ని అభ్యసించి నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఋగ్వేద పారాయణదారు గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 30 న అక్షయ తృతీయ రోజున కంచి కామకోటి సర్వజ్ఞ పీఠం 71వ పీఠాధిపతిగా ఆయన సన్యాసం స్వీకరించనున్నారు. ఈ శుభ తరుణంలో ఆలయ వైదిక బృందం సంతోషం వ్యక్తం చేశారు.