- బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భారత రాజ్యాంగం ద్వారా బహుజన శ్రామిక వర్గానికి సంక్రమించిన చట్టబద్ధమైన హక్కులను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ ల ద్వారా కాలం రాసిందని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బహుజన లెఫ్ట్ పార్టీ (బహుజన కమ్యూనిస్టు) బిఎల్ పి జిల్లా కార్యాలయంలో జరిగిన నిజామాబాద్, నిర్మల్ మంచిర్యాల జిల్లాల ముఖ్య నాయకుల సమావేశంలో దండి వెంకట్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి బీఎల్ఠీయూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. సిద్ది రాములు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పొందుపర్చిన 29 కార్మిక రక్షణ చట్టాలను కేంద్ర బిజెపి ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చి ఆధిపత్య దోపిడి కార్పోరేట్ కంపెనీల రక్షణ కవచంగా, బహుజన కార్మిక వర్గ శ్రమ దోపిడికి లైసెన్స్ ఇచ్చిందని విమర్శించారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన కార్మిక వర్గం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బని లత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.అరుణ, బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు చాట్ల పోశవ్వ, బి.జగదీష్, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు జి.గంగా శంకర్, ప్రధాన కార్యదర్శి మక్కల ఎల్లయ్య, ఉపాధ్యక్షులు నవీన్, ఆర్మూర్ డివిజన్ నాయకులు రాజేశ్వర్,శ్రీనివాస్, బోధన్ డివిజన్ కన్వీనర్ డి. పోలిశెట్టి, టి. సంజయ్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చెతన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
