నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
30-40 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగి గా పనిచేసి రిటైర్ అయిన వారికి ‘పెన్షన్’ జీవించే హక్కు లో భాగమని, మారుతున్న జీవన వ్యయాన్ని బట్టి డీఏ, పీఆర్ సీ పొందే హక్కు ప్రతి పెన్షనర్ కు ఉంటుందని, దాన్ని తొలగించే అధికారం ఎవ్వరికి ఉండదని వాలిడేషన్ పెన్షన్ రూల్స్ 2025 చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ జేఏసీ రాష్ట ప్రతినిధులు ఎం కాంతాబాయి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు తెలంగాణ జేఏసీ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. వాలిడేషన్ ఆఫ్ రూల్స్ చట్టాన్ని రద్దు చేయకుంటే ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. ముత్తారం నర్సింహ స్వామి పాల్గొన్న ఈ ప్రదర్శనలో జిల్లా జేఏసీ నాయకులు ఎల్ శ్రీధర్, ఎం బన్సీలాల్, ఎ రాజేందర్, సుదర్శన్, లింగయ్య, నర్సింహ రావు, భానోదయ స్వామి, కే వెంకట్ రావు, ఎం మురళీధర్, జేఎం దేవగౌడ్, అబ్దుల్ ఘని, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
